టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి
మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ తాజాగా
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో గోపీచంద్ సరసన
రాశి కన్నా
హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో నటించగా ,
రావు రమేష్ , సత్య రాజ్ ,
అనసూయ ,
అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను యు
వి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించగా, ఈ
మూవీ కి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు.
ఇప్పటికే ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ అందించిన కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు
మారుతి పక్కా కమర్షియల్
మాస్ ఎంటర్టైనర్
మూవీ లో
కామెడీ ని జోడిస్తూ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే జులై 1 వ తేదీన ఈ
మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే పక్కా కమర్షియల్ చిత్ర బృందం అనేక
టీవీ షో లలో పాల్గొంటూ మరియు
టీవీ ఇంటర్వ్యూ లలో , సోషల్
మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
సినిమా ట్రైలర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేయగా ఈ
సినిమా ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని అందాల
రాశి అనే వీడియో సాంగ్ లో చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పటికే ఈ
ఆడియో సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకుంది. సాయి చరణ్,
రమ్య బెహరా ఈ సాంగ్ ను పాడారు. ఇప్పటికే అందాల
రాశి ఆడియో సాంగ్ ఫుల్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మరి వీడియో సాంగ్ ఏ రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.