మ్యాచో మ్యాన్..
హీరో గోపీచంద్ గురించి మనకి తెలిసిందే.అయితే గత కొంత కాలంగా కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతున్నారు.ఇక 'జిల్'
మూవీ నుంచి బి. గోపాల్ డైరెక్షన్ లో చేసిన 'ఆరడుగుల బుల్లెట్' వరకు గోపీచంద్ నటించిన ఏ
మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.ఇకపోతే 'జిల్' నుంచి ఇప్పటి వరకు ఎనిమిది చిత్రాల్లో నటిస్తే అందులో
సంపత్ నంది రూపొందించిన 'సీటీమార్' మాత్రమే యావరేట్ హిట్ గా నిలిచి గోపీచంద్ కు ఊరటనిచ్చింది. అయితే గత ఏడేళ్లుగా కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
ఇకపోతే ప్రస్తుతం
మారుతి డైరెక్షన్లో గోపీచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' ఆయనని హిట్ ట్రాక్ ఎక్కించేలా కనిపిస్తోంది. కాగా జీఏ2 పిక్చర్స్ యువీ క్రియేషన్స్ లపై స్టార్
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యంగ్ అండ్ టాలెంటెడ్
ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ మూవీని నిర్మించారు.ఇక ఫస్ట్ లుక్
పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే పక్కా కమర్షియల్ లాయర్ పాత్రలో
హీరో గోపీచంద్ పాత్రని దర్శకుడు
మారుతి మలిచిన తీరు సినిమాకు పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తూ వస్తోంది.తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకున్న ఈ
మూవీ జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలావుంటే గోపీచంద్ మార్కు యాక్షన్
మారుతి మార్కు ఎంటర్ టైన్ మెంట్ ని మిలితం చేసి ఓ చక్కని యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. అయితే పాజిటీవ్ వైబ్స్ మొదలైన ఈ మూవీతో
హీరో గోపీచంద్ మళ్లీ ట్రాక్ లోకి రావాలనే ప్రయత్నాల్లో వున్నారు.ఇక ఈ ప్రాజెక్ట్ పై గట్టి నమ్మకంతో వున్న
హీరో గోపీచంద్ ఈ
మూవీ తరువాత పక్కా
మాస్ మసాలా హైవోల్టేజ్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలిసింది.అయితే