తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లెని షో బిగ్ బాస్.. ఈ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తీ చేసుకుంది.. ఇప్పటివరకు ఇక్కడకు వచ్చిన అందరూ కూడా టాప్ రేంజ్ లో ఉన్నారు. ఇకపోతే ఇక్కడ రూమర్స్ కూడా కాస్త ఎక్కువే..ఇటీవల షో లో రచ్చ చేసిన అరియానా గురించి అందరికి తెలుసు.. ఈ షో ద్వారా బాగా ఫెమస్ అయ్యింది.యాంకర్ శివ తాజాగా అరియానాను బయటకు పోదామని అడిగేశాడు. అరియానా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది..ఇన్ స్టా స్టోరీలో ఆమె తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఏమైనా అడగండి.. ఆన్సర్ చెప్తాను అని అనేసింది. దీంతో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అందులో కొందరు ఆమె చర్మ సౌందర్య రహస్యం అడిగారు.. ఇంకొందరు హెయిర్ కెర్ గురించి అడిగారు.. బిగ్ బాస్ జర్నీ గురించి అడిగారు.. ఇలా అందరూ ఇష్టమొచ్చిన ప్రశ్నలు సంధించారు.
ఈ చాటింగ్‌లోకి యాంకర్ శివ సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అరియానాతో మాట్లాడేశాడు.అరియానా ఆ ప్రశ్నను బయటపెట్టేసింది. ఫ్రీగా ఉన్నావా? ఉంటే బయటకు పోదాం అని అడిగేశాడు యాంకర్ శివ. దానికి అరియానా ఆశ్చర్యపోయినట్టుంది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి.. ఎక్కడికి పోదాంరా అని అనేసింది. మొత్తానికి ఈ ఇద్దరూ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో మరీ అంత క్లోజ్ అవ్వలేదు..
బయటకు వచ్చాక మాత్రం యాంకర్ శివ అరియానా అషూ రెడ్డి ఇలా అందరూ బాగానే కలిసి పోయారు. అందరూ కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. యాంకర్ శివకు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మంచి ఇమేజ్ వచ్చింది. బిందు మాధవితో స్నేహం యాంకర్ శివకు కలిసి వచ్చింది.
ఇక అతను ఆటను ఆడే తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ తరువాత యాంకర్ శివ జీవితం ఏదో మారిపోతోందని అందరూ అనుకున్నారు. కానీ మిగతా కంటెస్టెంట్ల మాదిరిగానే యాంకర్ శివ సైలెంట్ అయిపోయాడు. ఎక్కడా కనిపించడం లేదు. యాంకర్ శివ ఇప్పుడు కొత్తగా ఏమీ చేయడం లేనట్టు కనిపిస్తోంది..మిగిలిన వాళ్ళు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.