ఆ సినిమాతో చైతూ ఎంట్రీ ఇచ్చుంటే ఎప్పుడో స్టార్ అయ్యేవాడట?
చివరకు ఇదే కథను నాగార్జునకు చెప్పగా దెబ్బకు నాగ్ ఓకే చేయడంతో చైతు డెబ్యూ మూవీగా జోష్ వచ్చింది. అయితే ఇంతకంటే ముందు చైతును పరిచయం చేసేందుకు దిల్ రాజు నాగార్జున చుట్టూ బాగా తిరిగారట. సూపర్ హిట్ సినిమా కొత్తబంగారు లోకం సినిమాతో చైతును హీరోగా పరిచయం చేయాలన్నది దిల్ రాజు ప్లాన్.అయితే ఓ లెజెండ్రీ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా వస్తోన్న చైతుకు ఇంత సాఫ్ట్ కథ కన్నా కాస్త యూత్‌కు కనెక్ట్ అవ్వడంతో పాటు యాక్షన్ కూడా ఉండే కథ ఉంటే చాలా బాగుంటుందని నాగ్ చెప్పారట. అదే టైంలో అటు జోష్ కథను మెగా కాంపౌండ్ రిజెక్ట్ చేయడంతో అదే కథను కింగ్ నాగార్జునకు చెప్పారట. ఈ కథకు నాగ్ బాగా ఫిదా అయ్యి ఓటేయడంతో అలా చైతు డెబ్యూ మూవీగా జోష్ వచ్చి చేరింది. అయితే ఇక్కడే నాగ్ అంచనాలు తప్పాయి.బ్యాడ్‌లక్ ఏంటంటే దిల్ రాజు డెసిషన్ మేరకు వెళ్లి ఉంటే కొత్తబంగారు లోకం లాంటి సూపర్ హిట్ సినిమాతో యూత్‌కు పిచ్చగా కనెక్ట్ అయిపోతూ ఇక నాగచైతన్య ఎంట్రీ అనేది ఉండి ఉండేది. అయితే ఇక జోష్ లాంటి ప్లాప్ సినిమాతో చైతు ఎంట్రీ ఇచ్చాడు. అదే ఇక కొత్తబంగారు లోకం సినిమాతో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ చాలా రోజుల వరకు అదే సినిమా పేరు చెప్పుకుని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు.ఒకవేళ చైతూ ఆ సినిమా చేసుంటే ఖచ్చితంగా యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడేది.అయిన ఇప్పుడు చైతూ మెల్ల మెల్లగా యూత్ లో తన క్రేజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు.