అనసూయ చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్ గా దూసుకుపోతుంది .అంతేకాదు ఈమె తన అందం,హాట్ లుక్స్ తో పలు షోలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక దీంతో తనకు నచ్చిన రోల్స్ ను ఎన్నుకుంటూ సినిమాల్లో నటిస్తోంది.ఇకపోతే ఆమె పాత్రలన్నీ చాలా సెలెక్టివ్ గా ఉంటాయి. ఇక అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరుస్తుంటుంది అనసూయ . అయితే ఇటీవల ఈ బ్యూటీ అనసూయ తనకు మంచి ఫేమ్ తీసుకొచ్చిన 'జబర్దస్త్' షో నుంచి తప్పుకుందని తెలుస్తోంది. ఇదిలావుంటే సినిమాల పరంగా బిజీ అవ్వడమే దానికి కారణమని తెలుస్తోంది.
ఇకపోతే 'జబర్దస్త్'కి దూరమైన తరువాత వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది అనసూయ.అంతేకాకుండా తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. ఇక రీసెంట్ గా రెండు తమిళ సినిమాలు, ఒక మలయాళ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా.. ఇప్పుడో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా 'కన్యాశుల్కం' అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ఈ 'కన్యాశుల్కం'.అయితే ఇందులో అనసూయ.. మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్ లో కనిపించనుంది.
ఇక ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. అంతేకాదు త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. కాగా దర్శకుడు క్రిష్ ఈ సిరీస్ ను నిర్మించనున్నారు.ఇక ఈ మధ్యకాలంలో క్రిష్ దర్శకుడిగా సినిమాలు చేస్తూనే..ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ లకు కథలను అందిస్తూ.. నిర్మిస్తున్నారు.ఇకపోతే ఇటీవల ఈయన కథ అందించిన '9 అవర్స్' వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక మరోవైపు క్రిష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా భాగం షూటింగ్ని చాలా త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కి కండిషన్ పెట్టినట్లు కూడా సమాచారం. ఈ క్రమంలోనే కేవలం మూడు నెలల్లోనే హరిహర వీరమల్లు షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసేలా క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట...!!