పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు మరియు రాజకీయాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్
కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే...
అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంత కాలం పాటు కేవలం రాజకీయాల పైన ఫోకస్ పెట్టి సినిమాలకు దూరంగా ఉన్న పవన్
కళ్యాణ్ ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వీలుచిక్కినప్పుడల్లా
సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వస్తున్నాడు.
అందులో భాగంగా ఇప్పటికే పవన్
కళ్యాణ్ ఇప్పటికే రీ ఎంట్రీ లో భాగంగా వకీల్ సాబ్ , భీమ్లా
నాయక్ సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాలు కూడా
రీమేక్ మూవీ లు కావడం విశేషం. ఇది ఇలా ఉంటే పవన్
కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో
నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇలా హరిహర వీరమల్లు
మూవీ సెట్స్ పై ఉండగానే పవన్
కళ్యాణ్ మరో సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. పవన్
కళ్యాణ్ తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతం
మూవీ ని తెలుగులో
రీమేక్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ తో పాటు
సాయి ధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు. తాజాగా ఈ
సినిమా లాంచింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జులై 12 వ తేదీ నుండి ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్
మూవీ కి దర్శకత్వం వహించిన
సముద్ర ఖని ఈ
రీమేక్ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు.