'పక్కా కమర్షియల్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ తాజాగా పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాల్లోనూ ,  పోస్టర్ లలోనూ ,  టీజర్ , ట్రైలర్ లలో అన్నింటిలో కూడా గోపీచంద్ తన స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను అలరించాడు.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో 'జిల్' సినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా రెండవది. పక్కా కమర్షియల్ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా , యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించారు.  నిన్న అనగా జూలై 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున పక్కా కమర్షియల్ మూవీ విడుదల అయ్యింది. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా మొదటి రోజు ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా పక్కా కమర్షియల్ మూవీ మొదటి రోజు ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.


నైజాం : 80 లక్షలు , సీడెడ్ : 42 లక్షలు , యూ ఎ : 39 లక్షలు , ఈస్ట్ : 26 లక్షలు , వెస్ట్ : 21 లక్షలు , గుంటూర్ : 22 లక్షలు , కృష్ణ : 18 లక్షలు , నెల్లూర్ : 14 లక్షలు .
మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్కా కమర్షియల్ మూవీ 2.62 కోట్ల షేర్ , 4.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.10 కోట్లు .
ఓవర్ సీస్ లో : 0.35 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు పక్కా కమర్షియల్ మూవీ 3.07 కోట్ల షేర్ , 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: