సీనియర్
తమిళ నటుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు
లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన
విక్రమ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఏకంగా రూ. 400 కోట్ల పైగా వరల్డ్ వైడ్ వసూళ్లతో సత్తా చాటింది.కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా ఈ
సినిమా నిలిచింది. విడుదలైన అన్ని భాషల్లో కూడా
విక్రమ్ సంచలన విజయం సాధించింది. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన
విక్రమ్ ఎవరూ కూడా అసలు ఊహించని హిట్ అందుకుంది. ఇక తెలుగులో అయితే
విక్రమ్ డబుల్
బ్లాక్ బస్టర్ కొట్టింది. రూ. 7 కోట్లకు కొంటే సుమారు రూ. 17 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. కర్ణాటక ఇంకా కేరళలో సైతం
విక్రమ్ కొత్త రికార్డ్స్ నమోదు చేసింది.దర్శకుడు
లోకేష్ ప్రతిభను క్రిటిక్స్ ఇంకా ప్రేక్షకులు ప్రత్యేకంగా పొగుడుతున్నారు. కమల్ హాసన్ మాజీ
రా ఏజెంట్ రోల్ చేయగా, ఫహద్ ఫాజిల్ ఇంకా
విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేశారు. ఇంకా
సూర్య గెస్ట్ రోల్ చేయడం జరిగింది. యంగ్ మ్యూజిక్
డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ లో కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు. తాజాగా ఈ
మూవీ చూసిన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
విక్రమ్ టీం పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక
విక్రమ్ సినిమాను న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ ఇంకా
ఇండస్ట్రీ హిట్ గా మహేష్ వర్ణించారు.
లోకేష్ కనకరాజ్ టాలెంట్ అమేజింగ్ అని అన్నారు. ఇక
విక్రమ్ మూవీ రూపొందించడం గురించి దర్శకుడు
లోకేష్ కనకరాజ్ ని అడిగి తెలుసుకొన్నాను చాలా అద్భుతమనిపించింది అన్నారు. అనంతరం ఫహద్ ఫాజిల్ ఇంకా
విజయ్ సేతుపతి నటనను ప్రత్యేకంగా పొగిడారు. ఇక అనిరుధ్ బీజీఎం మరో స్థాయిలో ఉన్నట్లు కూడా ఆయన వర్ణించారు.ఇక చివరిగా కమల్ హాసన్ గురించి మహేష్(Mahesh Babu) చాలా గొప్పగా కొనియాడారు.
లెజెండ్ కమల్ హాసన్ నటన గురించి చెప్పే
అర్హత నాకు లేదు. ఒక అభిమానిగా నేను
విక్రమ్ మూవీ చూసి చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. మీకు కంగ్రాట్స్ సర్ అంటూ మహేష్ బాబు సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. మహేష్ బాబు
విక్రమ్ మూవీపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కమల్ ఇంకా
సూర్య అభిమానులు ఈ ట్వీట్స్ ని వైరల్ చేస్తున్నారు.