టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాస్ మరియు
మాస్ మూవీ లలో నటిస్తూ తనకంటూ
టాలీవుడ్ ఇండస్ట్రీలో సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న
రామ్ పోతినేని ప్రస్తుతం ది
వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించగా , కృతి శెట్టి ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది.
అలాగే ఈ
మూవీ ట్రైలర్ లో
రామ్ పోతినేని ,
ఆది పినిశెట్టి కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలిచాయి. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ
సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. దానితో 24 గంటల్లో ది
వారియర్ సినిమా ట్రైలర్ 10.53 మిలియన్ వ్యూస్ ను , 226.2 కే లైక్ లను సాధించింది. ప్రస్తుతం కూడా ది
వారియర్ మూవీ ట్రైలర్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.