బుల్లితెర మీద ప్రకారమైన
టీవీ షోలలో
బిగ్ బాస్ రియాల్టీ షోకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రియాలిటీ షోలో పాల్గొన్నవారు ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలను అందుకున్నారు..ఒక్క
బిగ్ బాస్ తో మంచి పాపులర్ అయ్యారు.బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న
అఖిల్ ఆ సమయంలో
మోనాల్ గజ్జర్ తో
లవ్ ట్రాక్ నడిపాడు.
బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్ళిన తర్వత కూడా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అంతేకాకుండా షార్ట్ ఫిల్మ్స్ లో కూడా కలిసి నటించారు. అయితే కొంత కాలం నుండి మోనాల్ పేరు వినిపించటం లేదు.
ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అఖిల్ తాజాగా తన
లవ్ బ్రేకప్ అయ్యిందని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన
నెటిజన్స్ మోనాల్ తో
అఖిల్ లవ్ బ్రేకప్ అయ్యిందా? అని అనుమానపడుతున్నారు... అయితే
అఖిల్ కు గతంలో చాలా సార్లు
లవ్ ఫెయిల్ అయ్యాడు.మొదటి
అమ్మాయి కుక్కల వెంట పడుతున్నానని బ్రేకప్ చెప్పిందని చెప్పాడు. ఇక రెండోసారి ప్రేమించిన
అమ్మాయి క్యాస్ట్ వేరు అని బ్రేకప్ చెప్పిందని తెలియచేశాడు.
ఇక ఇప్పుడు మూడోసారి కూడ
అఖిల్ లవ్ బ్రేకప్ అయ్యిందని తాజాగా పోస్ట్ చేశాడు. ఈ మేరకు అభిమానులు
అఖిల్ ని కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే రిలేషన్ షిప్ మీద మీ అభిప్రాయం ఏంటి ? ఒక నెటిజన్ అడగ్గా.. బ్రేకప్ అయ్యింది అంటూ
లవ్ బ్రేకప్ ఎమోజీలను
అఖిల్ షేర్ చేశాడు . అయితే కొందరు
నెటిజన్స్ మాత్రం ఎవరా? లక్కీ గర్ల్ ఎవరా అని కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే
అఖిల్ ఈ మధ్య బుల్లితెర పై సందడి చేస్తున్నారు. వరుస షో లలో కనిపిస్తున్నాడు.. అంతేకాదు సినిమాలు కూడా చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.