బిగ్ బాస్ ఎంట్రీ పై తరుణ్ మాటేమిటి..?
ఇక తన కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను పొందిన తరుణ్ ఆ తర్వాత సినిమాలు ఈయనకు పెద్దగా అదృష్టాన్ని తెచ్చి పెట్టలేదని చెప్పాలి. వరుసగా డిజాస్టర్ లను అందుకుంటూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇదిలా వుండగా.. బిగ్ బాస్ లోకి సినీ నటులకు అవకాశం రావడం.. ప్రేక్షకులలో వీరికి మళ్ళీ ఇమేజ్ పెరగడంతో వారికి సినిమా ఆఫర్లు వస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తరుణ్ కూడా గతంలో వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తరుణ్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఆయనకు మళ్ళీ సినిమాలలో ఆఫర్ వచ్చే అవకాశం ఉంది అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.
ఇకపోతే గతంలో కూడా బిగ్ బాస్ షోలోకి తరుణ్ ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ అప్పుడు తరుణ్ ఏమాత్రం స్పందించలేదు. మళ్లీ ఈ వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో స్పందిస్తాడా లేదా అనే విషయం అందరికీ సందిగ్ధంగా మారింది. వరుస పుకార్లపై ఎట్టకేలకు తరుణ్ స్పందించాల్సి ఉంది. ఇకపోతే సీజన్ 6 కి కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.