నందమూరి నట సింహం
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ
మూవీ లో
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దునియా
విజయ్ ప్రతినాయకుడి పాత్ర లో కనిపించబోతున్నా డు.
అలాగే ఈ
మూవీ లో వరలక్ష్మీ
శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది . ఈ
మూవీ లో వరలక్ష్మీ
శరత్ కుమార్ పాత్ర
సినిమా కి హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది . ఇలా ప్రస్తుతం
బాలకృష్ణ నటిస్తున్న
మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న వరలక్ష్మి
శరత్ కుమార్ ,
బాలకృష్ణ తదుపరి
మూవీ లో కూడా అదిరిపోయే క్యారెక్టర్ ను దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది . అసలు విషయం లోకి వెళితే ... బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న
సినిమా పూర్తి కాగానే
అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే .
ఇది ఇలా ఉంటే ఈ
సినిమా లో లేడీ విలన్ పాత్ర ఉండబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే . అయితే ఆ లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి
శరత్ కుమార్ కనిపించబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది . ఇక ఈ
మూవీ లో
బాలకృష్ణ కూతురు గా
శ్రీ లీల కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది . ఈ
సినిమా షూటింగ్ ఆగస్ట్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ
మూవీ లో
బాలకృష్ణ తో పాటు మరో
హీరో కూడా నటించబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.