టాలీవుడ్
ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరు గా కొనసాగుతున్న
కొరటాల శివ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు .
మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరీర్ ని మొదలు పెట్టిన
కొరటాల శివ మొదటి
సినిమా లోనే
మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ను ఇస్తూ సినిమాను తెరకెక్కించి
బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు .
కొరటాల శివ 'మిర్చి'
సినిమా తర్వాత
శ్రీ మంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను , ఆచార్య సినిమాలకు దర్శకత్వం వహించాడు . ఈ అన్ని సినిమాలు కూడా కమర్షియల్ హంగులతో తెరకెక్కినప్పటికీ తన
సినిమా లలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ లు ఇస్తూ తెరకెక్కించడం
కొరటాల శివ ప్రత్యేకత . అందులో భాగంగా
కొరటాల శివ దర్శకత్వం వహించిన
సినిమా లలో ఆచార్య
మూవీ ని మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే
బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో
కొరటాల శి వ, యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు .
మరికొన్ని రోజుల్లో ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది . ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందించనుండగా , రత్న వేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఈ సినిమాలో
హీరోయిన్ ఎవరు అనేది చిత్ర బృందం ఇప్పటివరకు కన్ఫామ్ చేయలేదు. ఈ
సినిమా పూర్తి అయిన తర్వాత
కొరటాల శివ , ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ 2023 వ సంవత్సరంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.