అలాగే ఈ సినిమాలు తెలుగు మరియు
తమిళ ఇండస్ట్రీలో
బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఇది ఇలా ఉంటే
కాంచన 3 మూవీ తర్వాత
రాఘవ లారెన్స్ నటించిన ఏ
సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది ఇలా ఉంటే
కాంచన 3 మూవీ తర్వాత సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన
రాఘవ లారెన్స్ ప్రస్తుతం మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
రాఘవ లారెన్స్ ప్రస్తుతం రుద్రన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కథిరేసన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తుండగా , ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ వారి ఈ
మూవీ ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ
సినిమా నుండి విడుదల చేసిన
పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ
మూవీ లో
రాఘవ లారెన్స్ సరసన ప్రియ భవాని
శంకర్ హీరోయిన్ నటిస్తోంది.
తాజాగా ఈ చిత్ర బృందం ఈ
మూవీ ని 23
డిసెంబర్ 2022 న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. ఈ సినిమాతో పాటు
రాఘవ లారెన్స్ పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కబోయే
చంద్రముఖి 2 సినిమాలో కూడా నటించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ
సినిమా వచ్చే సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా వరుస పెట్టి రెండు సినిమాలతో
రాఘవ లారెన్స్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నాడు.