ఆ బాధ తనకు లేదంటున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి.!!
మొదటిసారిగా గన్ పట్టుకోవడం ఎలా అనిపించింది అనే ప్రశ్న ఎదురుగా.. అందుకు లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ కొత్తగా అనిపించింది జూన్ కదా అన్ని కొత్తగానే ఉంటాయి సినిమా కూడా ఎంత అద్భుతంగా వచ్చింది నేను సహజంగానే జిమ్ బాక్సింగ్ చేస్తూ ఉంటాను కానీ మొదటిసారిగా స్క్రీన్ పై యాక్షన్ చూపించే అవకాశాలు ఈ చిత్రంతో దక్కిందని తెలిపింది. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం తమకు ఉంది అని తెలియజేసింది. ఈ చిత్రమే తన కెరీర్ కు కీలకంగా ఉంటుంది అని తెలిపింది.
డైరెక్టర్ రితేష్ రానా కథ చెప్పినప్పుడు మీకు నచ్చిన అంశం ఏమిటి అని అడగగా.. కథ ఐడియా చాలా బాగుంది కొత్త జోనర్ .. ముఖ్యంగా మైత్రి మూవీస్ నిర్మాణం సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. మీరు ఎక్కువగా కామెడీ సినిమాలు చేయడం తక్కువే కదా .. మొదటిసారి ఇలాంటి డిఫరెంట్ కామెడీ సినిమా చేయడం ఎలా అనిపించింది అనే ప్రశ్న ఎదురుగా నన్ను చాలా మంది సీరియస్ పర్సన్ అనుకుంటూ ఉంటారు నేను చేసిన పాత్రలు అలా ఉండడం వల్ల వారు అలా అభిప్రాయం పడవచ్చు కానీ నేను అందరితో చాలా సరదాగా జోక్స్ వేయడం తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. తన కెరియర్ లో నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లలేదని తనకు బాధేమి లేదు కానీ తన వర్క్ ని ఎంజాయ్ చేస్తూ ఎప్పటిలాగా ఒత్తిడి తీసుకొని మనసుకు నచ్చిన పాత్రలను చేస్తూ ఎంతో హ్యాపీగా తన జీవితాన్ని గడిపేస్తానని తెలిపింది