పవిత్రని ఆ సినిమాల నుంచి తీసేసిన నిర్మాతలు?

Purushottham Vinay
ప్రముఖ నటి పవిత్ర లోకేష్ ఇంకా అలాగే సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ఇక నిన్న మొన్నటి వరకు కూడా వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహ సంబంధమే అని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ వీరిద్దరూ కూడా కలిసి ఒకే హోటల్ గదిలో కనిపించడంతో అది కూడా నరేష్ భార్య ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేయడంతో టాలీవుడ్ లో ఈ అంశం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ అనేది జరుగుతోంది. ఇక నరేష్ కెరీర్ ఎంతవరకు ఇబ్బంది పడుతుందో తెలియదు కానీ తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు పాపం పవిత్ర లోకేష్ కెరియర్ మాత్రం ఈ వ్యవహారంతో బాగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఎందుకంటే పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది హీరోలకు తల్లి పాత్రలలో కనిపించింది. ఇంకా అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్లకు కూడా తల్లి పాత్రలో కనిపించి హోమ్లీ తల్లిగా మంచి గుర్తింపు పొందింది.



అయితే ఇక నరేష్ కు ఆమెకు మధ్య ఏమున్నదో తెలియదు కానీ మీడియాలో వీరిద్దరి మధ్య అసలు ఏదో జరుగుతుందనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో ఆమెను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తీసుకున్న రెండు పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు ఆమెకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారట. ఇక అదేమిటంటే ఆమె మేనేజర్ కి ఫోన్ చేసి ప్రస్తుతానికి ఆమె పాత్రలో వేరే వారిని తీసుకుంటున్నామని ఏమీ అనుకోవద్దు అని చెప్పినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.ఇక ఆ రెండు క్యారెక్టర్లు కూడా పెద్ద సినిమాలలో పెద్ద బ్యానర్లలోనే ఆమె చేయాల్సి ఉంది, కానీ రిస్క్ తీసుకోవడానికి ఆ పెద్ద బ్యానర్ల నిర్మాతలు సిద్ధంగా లేకపోవడంతో పాపం ఆమెను ఆ పాత్ర నుంచి తప్పించారని సమాచారం తెలుస్తోంది. అయితే మరి కన్నడ నాట కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమెకు అక్కడ కూడా ఇలాంటి రకమైన ఇబ్బందులు ఎదురవుతాయా లేదా అనేది ఇంకా చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: