పుష్ప 2 బహుమతుల మేళ !
వాస్తవానికి ‘పుష్ప 2’ కథ ఎప్పుడో ఫైనల్ అయింది. అయితే ఈ మూవీ పై పెరిగిన భారీ అంచనాలతో దర్శకుడు సుకుమార్ కు కన్ఫ్యూజన్ మొదలై ఈసినిమా కథను ఒకటికి రెండుసార్లు అందరితో చర్చించడమే కాకుండా ఈ మూవీ కథలో వరసపెట్టి మార్పులు చేర్పులు చేస్తూ ఉండటంతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం ఆలస్యం అవుతోంది అన్నప్రచారం జరుగుతోంది.
తెలుస్తున్న సమాచారంమేరకు సుకుమార్ హైదరాబాద్ లోని ట్రైడంట్ హోటల్ లో కూర్చుని ఈ మూవీ కథ గురించి తనకు తెలిసిన అనేకమంది యంగ్ రైటర్స్ తో వరసపెట్టి చర్చలు జరుపుతున్నాడట. అలా యంగ్ రైటర్స్ తో చర్చలు జరుపుతూ అతడికి ఈకథకు సంబంధించి ఒక మంచి పాయింట్ చెప్పిన వారికి బహుమతులు కూడ ఇస్తున్నాడట. వాస్తవానికి సుకుమార్ తన చుట్టూ ఉన్న యంగ్ రైటర్స్ తో తన సినిమా కథకు సంబంధించి చర్చలు జరిపే అలవాటు ఎప్పటి నుంచో ఉంది అని అంటారు.
అయితే ఇలా చర్చలు జరుపుతున్నప్పుడు సుకుమార్ కు ఆ యంగ్ రైటర్స్ చెప్పిన పాయింట్ నుండి మరొక కొత్త ఆలోచన వస్తుందట. అందువల్ల తన సినిమా కథ చాల పక్కాగా తయారవుతుంది అనీ సుకుమార్ నమ్మకం అని అంటారు. ఇప్పుడు ఆ నమ్మకంలో భాగంగానే సుకుమార్ ‘పుష్ప 2’ కథ గురించి తన రైటర్స్ టీమ్ తో తెగ చర్చలు చేస్తున్నాడట. ఎన్నో హిట్స్ సినిమాలకు దర్శకత్వం వహించి కథ అందించిన సుకుమార్ కు ‘పుష్ప 2’ కథ విషయమై కొనసాగుతున్న కన్ఫ్యూజన్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..