ఈ
మూవీ కి దేవి
శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ
మూవీ ని జూలై 14 వ తేదీన తెలుగు మరియు
తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే చిత్ర బృందం ఈ
సినిమా ప్రమోషన్ లను వేగ వంతం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ
సినిమా టీజర్ , ట్రైలర్ , కొన్ని పాటలను కూడా విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తాజాగా ది
వారియర్ చిత్రబృందం ఈ
సినిమా తమిళ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్
ఈవెంట్ కు
కోలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఇది ఇలా ఉంటే ది
వారియర్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్
ఈవెంట్ కు కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈ
సినిమా తెలుగు ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను జూలై 10 వ తేదీన జే ఆర్ సి కన్వెన్షన్,
హైదరాబాద్ లో నిర్వహించాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
సినిమా నుండే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ లు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రముఖులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
సినిమా ఎలాంటి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.