టాలీవుడ్ 'మహారాణి' మృణాళిని ఠాకూర్.. వారిని తొక్కేస్తుందా ?

VAMSI
బాలీవుడ్ లో సూపర్ 30 సినిమాలో సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించిన హీరోయిన్ మృణాళిని ఠాకూర్ ఎంతమందికి గుర్తుంది అనేది తెలియదు. కానీ ఈమె గురించి హాట్ టాపిక్స్ టాలీవుడ్ లో నడుస్తున్నాయి. అదేంటి బాలీవుడ్ హీరోయిన్ గురించి టాలీవుడ్ లో చర్చ అనుకుంటున్నారా ? నిజమే ఈమె కెరీర్ లో చూస్తే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత టాలెంట్ ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడిని ఆకర్షించింది. ఈయన తన తాజా సినిమా సీతారామం లో సీత పాత్రకు మృణాళిని ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమా ఒక సైనికుడి ప్రేమ కథగా అద్భుతంగా తెరకెక్కుతోంది.

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్ మరియు రెండు పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో మృణాళిని లుక్స్ మరియు బ్యూటీ ని చూస్తుంటే ఖచ్చితంగా ఈమె కోసమే ప్రేక్షకులు థియేటర్ లకు వెళ్లడం పక్కా అని తెలుస్తోంది. ఇక సినిమాలో దుల్కర్ సల్మాన్ మరియు మృణాళిని ల మధ్యన కెమిస్ట్రీ ఒక రేంజ్ లో ఉంటుందని పాటల ద్వారా అవగతం అవుతోంది. ఓవరాల్ గా సినిమా ఎల్లా ఉన్నప్పటికీ... తెలుగులో మృణాళిని హీరోయిన్ గా సెటిల్ అవుతుంది అన్న విషయాన్ని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ ల హవా పూర్తిగా తగ్గిపోయింది.

అందరూ పూజ హెగ్డే మరియు రష్మిక మందన్న ల వెనకే పడుతున్నారు. ఇలా మృణాళిని ఠాకూర్ లాంటి ఫ్రెష్ పేస్ ను ట్రై చేస్తే సక్సెస్ ఉంటుంది మరియు ప్రేక్షకులకు కూడా ఒక చేంజ్ ఉంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం మృణాళిని ఠాకూర్ ఎంతవరకు టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: