నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో 107 సినిమా కావడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుకుంటుంది .
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది . ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే టీజర్ ను విడుదల చేయగా, ఈ టీజర్ లో బాలకృష్ణ లుక్ అదిరిపోయే రేంజ్ లో ఉండడం మరియు టీచర్ లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ లు అలాగే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్ బి కే 107 చిత్రీకరణ శరవేగంగా జరుగుతోం.ది ఎన్ బి కే 107 మూవీ షూటింగ్ ని మొదట్ లో కొంత భాగాన్ని యూ ఎస్ లో షూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కాకపోతే వీసాల సమస్యల వల్ల ఆ షూటింగ్ ను వేరే దేశంలో చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్ బీ కే 107 మూవీలో ఒక చిన్న షూటింగ్ షెడ్యూల్ ని టర్కీ లో చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తుండగా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవగానే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.