ప్రస్తుతం కోలీవుడ్‌లో అంతా వాతావరణం హీటెక్కుతుంది. అయితే తమిళనాడు నడిగర్ సంఘం ఎన్నికలు గతంలో ఎంత పెద్ద వివాదాన్ని సృష్టించాయో, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇకపోతే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వాయిదా పడిన ఈ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇక ప్రస్తుతానికి హీరోలు విశాల్, కార్తీలు నడిగర్ సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ క్రమంలో వారిని చంపుతానని కొలీవుడ్ నటుడు ఒకరు బెదిరించినట్లుగా నడిగర్ సంఘం అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలావుంటే టాలీవుడ్ లో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత వేడి పుట్టించాయో అంతకు మించి తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు కూడా దాదాపు అంతే వివాదాన్ని సృష్టించాయి. ఇకపోతే రెండు వర్గాలుగా విడిపోయిన నటీనటులు, మేము గెలిచామంటే మేము గెలిచామంటూ పెద్ద ఎత్తున వివాదాల సృష్టించారు. కాగా కోర్టు ఆదేశాలతో ఈ ఎన్నికలలో నాజర్ సంఘం గెలిచినట్లు ప్రకటించారు.ఇకపోతే నాజర్ బృందంలో హీరోలు విశాల్, కార్తీలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మీద అక్కసు పెంచుకున్న రాజదురై అనే ఒక నటుడు వారిద్దరిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని...
అంతేకాదు వారిని చంపేస్తానని కూడా సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నాడని నడిగర్ సంఘం అధికారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే సోషల్ మీడియాలో, విశాల్ , కార్తీలను చంపేస్తానని బెదిరించడమే కాక వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసి వారి అభిమానులైన పలువురిని రెచ్చగొడుతున్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలావుంటే రాజ దొరై మీద కఠిన చర్యలు తీసుకొని ఇకమీదట ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక అంతేకాక హీరో విశాల్ కార్తీ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలని కోరినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం...!!