తెలుగు,
తమిళ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు విలక్షణ నటుడు స్టార్
హీరో విక్రమ్..ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఎంతో అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ విక్రమ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇది విక్రమ్ అభిమానులకు షాకింగ్ వార్తనే చెప్పాలి.
హీరో విక్రమ్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో
హీరో విక్రమ్ కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో విక్రమ్ అభిమానులంతా ఆయన క్షేమంగా తిరిగిరావాలంటూ ఆకాంక్షిస్తున్నారు..ఈ రోజు సాయంత్రం 6 గంటలకు చెన్నైలో ' పొన్నియన్ సెల్వన్ ' చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉంది.
విక్రమ్ విలక్షణ నటనకు పెట్టింది పేరు.
టాలీవుడ్ లో మొదట్లో క్యారెక్టర్ ఆరిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేసిన విక్రమ్..
కోలీవుడ్ లో అపరిచితుడితో మంచి పేరు ఫేమ్ వచ్చింది. విభిన్న చిత్రాలతో..
సినిమా సినిమాకు కొత్త వేరియేషన్ చూపిస్తూ తనలోని నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ. అభిమానులను అలరిస్తుంటాడు. 55 ఏళ్ళు దాటినా
విక్రమ్ విభిన్న పాత్రల్లో నటిస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్నాడు. విక్రమ్ సినిమాల్లో
హీరో పాత్ర చాలా వైవిద్యంగా ఉంటుంది.. పాత్రకు అనుగుణంగా తనని తాను మలచుకుంటూ.. అద్భుత నటనతోనే కాకుండా గెటప్‌లతోనూ ఆకట్టుకుంటాడు..
వరస సినిమాలను లైన్ లో పెట్టాడు. మణిరత్నం దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్, కోబ్రా , దర్శకుడు పా రంజిత్‌తో కొత్త చిత్రంతో సహా అనేక చిత్రాల్లో నటిస్తున్నాడు. నిర్మాణంలో వివిధ దశల్లో పలు చిత్రాలు ఉన్నాయి. ఇటీవల
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన మహాన్‌లో కనిపించాడు. ఇందులో
విక్రమ్ తనయుడు నటుడు
ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ రిలీజ్ చేశారు.విక్రమ్ హీరోగా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన కోబ్రా ఆగష్టు 11న రిలీజ్ కానుంది. ఈ మూవీలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీనిధి శెట్టి, మిర్నాళిని రవి, KS
రవికుమార్ ,మియా జార్జ్ తదితరులు నటిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1
సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి,
శరత్ కుమార్,
త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.