ప్రభాస్ "స్పిరిట్"... సందీప్ రెడ్డి న్యూ ప్లాన్ ?
ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె మరియు స్పిరిట్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇందులో స్పిరిట్ ను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా కాస్టింగ్ పనులలో ఈ కుర్ర డైరెక్టర్ బిజీగా ఉన్నాడు. అయితే అర్జున్ రెడ్డి మూవీ డిఫరెంట్ మరియు ఇప్పుడు ప్రభాస్ తో తీయబోయే సినిమా చాలా డిఫెరెంట్ అని తెలిసిందే. కాగా ప్రభాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు సందీప్ రెడ్డి. బాహుబలి తరువాత ప్రభాస్ తీసిన సినిమాలలో జరిగిన తప్పులను ఇందులో జరగకుండా ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి సందీప్ ఈ సినిమా కోసం కొత్త రకమైన ఫార్ములాను వాడనున్నాడని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకన్నా ముందు ఆదిపురుష్, సలార్ మరియు ప్రాజెక్ట్ కె లు రిలీజ్ ఐయిపోతాయి. కాబట్టి వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఏ మాత్రం తగ్గకుండా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.