కొత్త ప్రియురాలతో లాంగ్ డ్రైవ్ కి వెళుతున్న హృతిక్ రోషన్..!!

Divya
బాలీవుడ్లో హృతిక్ రోషన్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఉన్నారు. ఇక తాజాగా కొత్త ప్రియురాలు అయిన సాబా ఆజాద్ తో హృతిక్ రోషన్ లవ్ లో ఉన్నట్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది ఈ విషయం. ఇక వీరిద్దరూ కలిసి పబ్లిక్ లో కూడా చట్టపట్టలేసుకొని తిరగడంతో మరింత వైరల్ గా మారుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ ముంబైలో కలిసి కనిపించినప్పుడు వీరి రిలేషన్ పైన పలు రకాలుగా వార్తలు వెలుపడ్డాయి ఇంతలోనే సోషల్ మీడియాలో ఈ జంట లవ్ రొమాన్స్ కి సంబంధించి వ్యవహారం కూడా వెలుగులోకి రావడం జరిగింది.

నీకు అటుపై అభిమానులు సైతం సోషల్ మీడియాలో వీటి గురించి బాగా సెర్చ్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత గోవా షికార్ కి ముంబై ఎయిర్ పోర్టు లో చేయి చేయి వేసుకొని మరీ జోడీగా కనిపించారు. ఇక కరుణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలలో కూడా కనిపించారు ఇప్పుడు తాజాగా వీరిద్దరూ ఫ్రాన్స్ లో రొమాంటిక్గా తమ సమయాన్ని గడుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించి పలు ఫోటోలు కూడా వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
కొద్ది గంటల క్రితం సాబా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ ఓపెన్ టాప్ కార్ సీట్లో కూర్చొని ఉండగా ఫ్రాన్స్ లో సుందరమైన ప్రదేశాలను ఫోటోలు తీస్తున్నట్లుగా ఒక వీడియోని షేర్ చేసింది. తన పక్కన హృతిక్ రోషన్ కూడా ఉన్నట్టుగా కెమెరాలు చూపించడం జరిగింది. దీంతో హృతిక్ రోషన్ ఒక్కసారిగా తన ముఖాన్ని దాచేసాడు దీనివల్ల అక్కడ ఉన్నది హృతిక్ రోషన్ అనే విషయం మనకి క్లియర్ గా తెలుస్తోంది. ది ఇక అంతే కాకుండా రుతిక్ రోషన్ ఎప్పటిలాగానే తన వేళ్లకు నల్లటి ఉంగరాన్ని ధరించడం గమనించిన అభిమానులు హృతిక్ రోషన్ కనిపెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: