స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్న హీరో రామ్..
ది వారియర్ సినిమా గురించి చెబుతూ, అప్పట్లో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెబుతూ హీరో రామ్ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా చేసే సమయంలో తాను నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయానని చెప్పారు రామ్. అప్పటికి షూటింగ్ కు ఇంకా నెలరోజులే టైమ్ ఉందని, తాను పోలీస్ క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్నానని గుర్తు చేసుకున్నారు రామ్. సరిగ్గా అదే టైమ్ లో రామ్ కి చిన్న దెబ్బ తగిలింది. స్పైనల్ కార్ట్ దగ్గర రామ్ కి గాయమైంది. మూడు నెలలైనా ఆ గాయం మానలేదు. నొప్పి తగ్గలేదు. దీంతో రామ్ బాగా డల్ అయ్యారు. డాక్టర్స్ కూడా బరువులు ఎత్తే రిస్క్ చేయొద్దన్నారు. కానీ రామ్ కి అది చాలా క్రూషియల్ టైమ్. సినిమానా, జీవితమా అని ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఆ సమయంలో తనకు ఫ్యాన్స్ సపోర్ట్ బాగా ఉందని చెప్పారు రామ్.
ఆ సమయంలో సోషల్ మీడియాలో తనకు ఫ్యాన్స్ నుంచి వచ్చిన మెసేజ్ లు చాలా రిలీఫ్ ఇచ్చాయని, అన్నా నువ్వేమీ చేయొద్దు.. ఈ సినిమా నుంచి మేమేమీ ఆశించడంలేదంటూ ఫ్యాన్స్ మెసేజ్ లు పెట్టారని, అప్పుడు తనకు ఫ్యా్స్ లవ్ అన్ కండిషనల్ అనిపించిందని చెప్పారు. మీరా.. నేనా అనే రోజు వస్తే.. మీరు లేకపోతే నేను లేను అని తనకు అర్థమైందని ఫ్యాన్స్ ని ఉద్దేశించి చెప్పారు రామ్. అందుకే ఆ నొప్పి భరిస్తూ డ్యాన్స్ చేశానని చెప్పుకొచ్చారు. అది ఫ్యాన్స్ తనకు ఇచ్చిన ఎనర్జీ అన్నారు. ఈ సినిమా తనకు ఎంతో నేర్పిందని, స్క్రీన్ మీద సినిమా చూసినా, తనకు ఆ గాయాలేవీ గుర్తు రాలేదని, కేవలం ఫ్యాన్స్ మాత్రమే గుర్తొచ్చారని అన్నారు రామ్. రామ్ హీరోగా, లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సిినిమాకు సంగీతం అందించారు. తెలుగుతోపాటు, తిమిళ్ లో కూడా ది వారియర్ విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. హీరో రామ్ ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నారు. అలాగే దర్శకుడు లింగు సామి కూడా ఈ సినిమాతో మరోసారి తెలుగులో తన సత్తా చూపించాలనుకుంటున్నారు.