పోలీస్ పాత్ర చెయ్యొద్దనుకున్నా.. కానీ.. రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
జగడం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన రామ్ ఆ తర్వాత తన డాన్సులతో నటనతో తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎనర్జిటిక్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఎన్నో కొత్త జానర్ సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే  ఉంటాడు రామ్.  అయితే ఒకప్పుడు వరుస పరాజయాలతో రామ్ కెరియర్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్న సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా అతనికి ఊహించని రీతిలో బూస్ట్ ఇచ్చింది.


 ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా తర్వాత రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ పోతినేని హిట్ కొట్టలేకపోయాడు. ఇక ఇప్పుడు ఒక వైవిధ్యమైన సినిమాతో   ప్రేక్షకులను పలకరించ పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ది వారియర్ అనే సినిమాతో థియేటర్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు రామ్. అయితే ఈ సినిమాలో ఇక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తమిళ డైరెక్టర్ లింగుస్వామి సినిమా స్టోరీ ని సిద్ధం చేసుకున్నారు.



 ఇక ఈ స్టోరీ హీరో రామ్ కు వినిపించాడట. స్టోరీ నచ్చడంతో వెంటనే ఓకే చేశాడట రామ్. కాగా ఇటీవలే సినిమా ప్రమోషన్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గతంలో పోలీసు పాత్రలు చేద్దామని ఎన్నో కథలు విన్నాను. కానీ అన్ని స్టోరీలు ఒకేలా అనిపించడంతో కొద్దిరోజులు పోలీస్ పాత్రలో వద్దు అని నిర్ణయించుకున్నాను అంటూ రామ్ పోతినేని చెప్పుకొచ్చాడు. తర్వాత లింగస్వామి ది వారియర్ మూవీ స్టోరీ చెప్పడంతో పోలీస్ కథ చేస్తే ఇలాంటిదే చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. సినిమాకు ఓకే చెప్పేశాను అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: