కొరటాల సినిమా కమిటయ్యి తారక్ తప్పు చేశాడా?

Purushottham Vinay
ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ఇక ఇప్పటకీ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. కొరటాల శివ హిస్టరీ చూసేసి గుడ్డిగా నమ్మేసి ఓకే చెప్పేశాడు. అయితే ఆచార్య సినిమా రిజల్ట్ ని చూశాక కొరటాల శివ ఎన్టీఆర్‌కు ఎలాంటి కథ సెట్ చేయాలో సతమతమవుతున్నాడు. అయితే ఇప్పటకీ ఫైనల్ స్క్రిఫ్ట్‌ను లాక్ చేయలేదని సమాచారం తెలుస్తోంది.అందుకే ఇప్పటకీ ఈ సినిమా అదిగో ఇదిగో అని చెపుతున్నా కూడా ఇంకా అది సెట్స్ మీదకు వెళ్లలేదు. ఎన్టీఆర్ టైం కూడా అటు బాగా వేస్ట్ అవుతోంది. అసలు కొరటాల ఈ సినిమాను ఎప్పటకీ ఫినిష్ చేస్తాడో అని అర్థంకాక ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ప్రశాంత్‌నీల్ ప్రభాస్‌తో సలార్ సినిమా పూర్తి కూడా చేసి ఎన్టీఆర్ సినిమా కోసం కాచుకుని ఉన్నాడు. అయితే ముందుగా కొరటాల శివ సినిమా పూర్తవ్వాలి.ఓ వైపు ఆచార్య సినిమాతో కొరటాలకు దిమ్మతిరిగే దెబ్బ తలగడంతో కథలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో తెలియక కొరటాల శివ ఇబ్బందులు పడుతుంటే.. అటు హీరోయిన్ కూడా ఇంకా ఇప్పటకీ సెట్ కాలేదు.



ఎన్టీఆర్‌కు ఇంకా హీరోయిన్‌ను సెట్ చేయకపోవడం ఏంటని కూడా ఆయన అభిమానులు కొరటాల శివని సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. కొరటాల శివ ఇంకా ఫైనల్ స్క్రిఫ్టే లాక్ చేయకపోవడంతో ఇంకా హీరోయిన్ వరకు వెళ్లేనే లేదు.ఆచార్య సినిమాలో అస్సలు ఎలివేషన్లే లేవు. ఎన్టీఆర్ కోసం ముందు రాసుకున్న కథలో కూడా ఎలివేషన్లు లేకపోవడంతో ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేర్పులు చేసే పనిలో కొరటాల బిజీగా ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. అదే ఎన్టీఆర్ కొరటాల శివను  బ్లైండ్‌గా నమ్మకుండా ఫుల్ స్క్రిఫ్ట్ విన్నాకే ఓకే చెప్పి ఉంటే అసలు ఇంత ఆలస్యం అయ్యేదే కాదు. అసలే ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం నాలుగేళ్ల టైం లాస్ అయ్యింది అంటే.. ఇప్పుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ టైం మరీ వేస్ట్ చేస్తోన్న పరిస్థితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: