ఎనర్జిటిక్ స్టార్
రామ్ కొత్త
సినిమా ది
వారియర్ ఎల్లుండి విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వర్షాలు ఒకపక్క టెన్షన్ పెడుతున్నప్పటికీ రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందన్న వాతావరణ శాఖ అంచనా నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక
రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న
వారియర్ ముందు చాలా పెద్ద టార్గెటే ఉంది.ఇకపోతే ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీకి 43 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. అయితే ....అంటే బ్రేక్ ఈవెన్ చేరాలంటే ఇంకో కోటి అయినా అదనంగా రావాలి.
ఇదిలావుంటే నైజామ్ 11 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, ఆంధ్రా 17 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాలకు 34 కోట్లకు అమ్మారు. ఇక
తమిళ వెర్షన్ 5 కోట్లు పలకగా, రెస్ట్ అఫ్ ఇండియాకు 2 కోట్లు, ఓవర్సీస్ కు 2 కోట్ల సొమ్ము చేసుకుంది. పోతే మొత్తంచూసుకుంటే 43 కోట్లవుతుంది.ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెద్ద మొత్తం. ఇక ఆర్ఆర్ఆర్,
కెజిఎఫ్ 2, విక్రమ్, మేజర్ లు మాత్రమే జనాన్ని
థియేటర్ దాకా రప్పించగలిగాయి.అయితే తాజాగా ఇప్పుడు ది
వారియర్ కు ఆ స్థాయి టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈజీనే.అయితే ఒకవేళ ఏ మాత్రం అటుఇటు అయినా చాలా కష్టం.పోతే ప్రస్తుతమున్న తుఫాను పరిస్థితుల వల్ల చివరి నిమిషంలో పైన చెప్పిన ఫిగర్లలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు.
ఇక
తమిళ్ అగ్ర దర్శకుడు లింగస్వామి దర్శకత్వ వహిస్తున్న ఈ సినిమాలో మొదటిసారి
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో
రామ్ డిసిపి
సత్య అనే క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై
చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రం నిర్మించగా..
దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ
సినిమా అనంతరం మా
స్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తో తన తదుపరి
సినిమా చేస్తున్నాడు
రామ్ పోతినేని. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే..!!