"ది వారియర్" మరో "విక్రమ్" అవుతుందా... తుస్సుమంటుందా ?
అయితే ఇప్పుడు విక్రమ్ తర్వాత ఈ నెలలో రానున్న సినిమాలు కూడా అదే స్థాయి ఫలితాన్ని అందుకుంటాయా అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో స్టార్ట్ అయింది. కాగా రిలీజ్ కానున్న సినిమాలలో ముందుగా మనము చెప్పుకోవాల్సింది రామ్ నటించిన 'ది వారియర్' గురించి... ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన పోస్టర్, టీజర్, సాంగ్స్ మరియు ట్రెయిలర్ అన్నీ కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న భావనను కలిగించాయి. అయితే విక్రమ్ స్థాయి హిట్ ను అంధిస్తుందా అన్నదే ఇప్పుడు సందేహంగా మారింది.
మామూలుగా ఎప్పటి నుండో తెలుగు ప్రేక్షకులలో ఉన్న ఒక భావన ఏమిటంటే... తమిళ డైరెక్టర్ నుండి సినిమా అంటే మాస్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మాస్ కూడా మరీ అతిగా ఉంటే తెలుగు ప్రేక్షకులు అంగీకరించరు. అయితే డైరెక్టర్ లింగుస్వామి మాస్ అంశాలను సమపాళ్లలో కలిపి తెరకెక్కించారా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమా మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విక్రమ్ అంత హిట్ కాకపోయినా... మోస్తరు విజయాన్ని అందుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.