'రంగమార్తాండ' మూవీ డబ్బింగ్ పనులను ప్రారంభించిన అనసూయ..!

Pulgam Srinivas
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కృష్ణ వంశీ ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు .


ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రియేటివ్ దర్శకుడి గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ గత కొన్ని సంవత్సరాలుగా బాక్సా ఫీస్ దగ్గర విజయాలను అందుకోవడం లో చాలా వరకు వెనుక బడి పోయారు . చాలా సంవత్సరాల క్రితం చందమామ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న కృష్ణ వంశీ ఆ తర్వాత అనేక సినిమాలకు దర్శకత్వం వహించి నప్పటికి ఆ సినిమాలు ఏవి కూడా బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే విజయాలను సాధించలేదు . ఇది ఇలా ఉంటే ఆఖరుగా కృష్ణ వంశీ 'నక్షత్రం' మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఇది ఇలా ఉంటే తాజాగా క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ 'రంగమార్తాండ' అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు .


మరాఠీ హిట్ మూవీ నటసామ్రాట్ మూవీ కి రంగ మార్తాండ అధికారిక రీమేక్ గా తెరకెక్కుతోంది . ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం , అనసూయ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు . ఇది ఇలా ఉంటే రంగ మార్తాండ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది . హౌస్‌ఫుల్ మూవీస్ , రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: