"సుప్రీతా - అనన్య నాగళ్ళ" రివెంజ్ డ్రామా ?

VAMSI
సినీ ఇండస్ట్రీలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన న‌టి సురేఖా వాణి. అంతేకాదు ఆ మ‌ధ్య కాలంలో సురేఖా వాణి సినిమా లేదంటే అతిశ‌యోక్తి కాదు. అంతెందుకు ప్ర‌తి సినిమాలో ఏదో ఒక పాత్ర‌లో క‌నిపించి మెప్పించేది. అయితే ఇటీవ‌ల ఆఫ‌ర్స్ కాస్త త‌గ్గ‌డంతో కూతురితో క‌లిసి నానా ర‌చ్చ చేస్తుంది. అంతేకాదు ముఖ్యంగా పొట్టి దుస్తుల‌లో వీరు చేస్తున్న హంగామాని చూసి నెటిజ‌న్స్ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. నటి సురేఖ వాణి సుప్రీత లు చూడ్డానికి త‌ల్లి కూతుళ్ల‌లా కాకుండా చాలా మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు. అంతేకాదు వయస్సులో కూడా పెద్ద డిఫరెన్స్ కనిపించదు. ఇక ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ వీడియోల‌కు తెగ స్టెప్పులు వేస్తుంటారు.

అంతే కాదు..ఇద్దరు కలసి విదేశాలకు వెళ్ళి మరీ ఎంజాయ్ చేయడం.. అలాగే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం వీరికి చాలా కామన్ గా మారింది. ఈ విషయంలో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయ్యారు. ఇలా అమ్మాకూతుళ్ళూ పబ్లిక్ లో వైరల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సురేఖ కూతురు సుప్రీతకు ఓ తెగ ఆఫర్లు వస్తున్నాయని తెగ వార్తలు వస్తున్నాయి. కానీ వీటిలో ఏదీ వాస్తవం లేకపోవడం విశేషం. అయితే ఏదో కొన్ని యాడ్ లు మాత్రమే తన ఖాతాలో ఉన్నాయట.

ఇది కాకుండా త్వరలోనే ఒక వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా చేయనున్నట్లు ఇండస్ట్రీ నుండి వినిపిస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ కథను సుప్రీతా విని ఓకే చేసిందట. ఇందులో ఈమెతో పాటుగా అనన్య నాగళ్ళ కూడా చేస్తోంది. ఇది ఒక లేడీస్ రివెంజ్ డ్రామాగా రానుంది. ఈ వెబ్ సిరీస్ ను తమిళ యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వార్త వెలువడే అవకాశం ఉంది. మరి చూద్దాం ఇందులో ఎంత వరకు నిజం ఉందో ?  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: