వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' మూవీ కొత్త విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ఉప్పెన తోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టే అరుదైన రికార్డ్ ను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో తన తదుపరి సినిమా అయిన కొండపొలం తో మాత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయడు. 


క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే వైవిధ్యమైన సినిమాను తన రెండవ సినిమాగా ఎంచుకొని ఎంతో సాహసం చేసిన పంజా వైష్ణవ్ తేజ్సినిమా ద్వార మర్శకుల ప్రశంసలను అందుకున్న కమర్షియల్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. అలా కొండపొలం సినిమాతో ప్రేక్షకులను నిరాశ పరిచిన పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి గిరిశయ్య దర్శకత్వం వహిస్తుండగా , రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్  సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఈ మూవీ కి సంగీతం  సంగీతాన్ని అందిస్తుండగా, శ్యామ్ ద‌త్ ఈ మూవీ కి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 


ఇది ఇలా ఉంటే గతంలో ఈ మూవీ కి కొన్ని సార్లు విడుదల తేదీలను ప్రకటించినప్పటికీ అనేక కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్ర బృందం మరో కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ఒక అధికారిక ప్రకటన చేసింది. మరి ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: