"థాంక్యూ" మూవీ మరో "మజిలీ" కానుందా ?

VAMSI
అక్కినేని నాగార్జున నట వారసులు నాగచైతన్య మరియు అఖిల్ లు హీరోలుగా మారిన సంగతి తెలిసిందే. అయితే చై మాత్రం నటుడిగా చాలా సాధించాడు... ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో హిట్ ట్రాక్ లో ఉన్న వారిలో చై ఒకడు. వరుసగా సక్సెస్ సినిమాలను చేస్తూ తండ్రి పేరును నిలబెడుతున్నాడు. అయితే అఖిల్ మాత్రం ఇంకా హీరోగా స్థిరపడలేదు అని చెప్పాలి. ఇదిలా ఉంటే... నాగచైతన్య నటించిన తాజాగా చిత్రం "థాంక్యూ". తన ఫ్యామిలీకి జీవిత కాలం గుర్తుండిపోయేలా అద్భుతమైన గిఫ్ట్ మనం సినిమాను ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఇప్పుడు చై తో థాంక్యూ తెరకెక్కించాడు. అందుకే ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుండి అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే నాగచైతన్య సీనియమాకు భారీగా కలెక్షన్ లు రాకపోవచ్చేమో కానీ... నిర్మాతలు నష్టపోయే  పరిస్థితి అయితే లేదు. అందుకే చై కి మంచి మార్కెట్ ఏర్పడింది. నాగచైతన్య రీసెంటుగా తీసిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇది కూడా హిట్ అవుతుందని నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమాలో అవికా గౌర్, మాలాబ్\విక నాయర్ మరియు రాశి ఖన్నాలు వివిధ పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే వారంలో ఈ చిత్రం అన్ని థియేటర్ లాల్;ఓ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఎస్ ఎస్ థమన్ మరోసారి చక్కని సంగీతాన్ని అందించాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు మరియు ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెంకీమామ, లవ్ స్టోరీ మరియు బంగార్రాజు లతో హిట్ లను అందుకున్న చై ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడా అన్నది చూడాలి. ట్రైలర్ ను చుసిన వారు ఈ సినిమా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. మజిలీ లాగా ఉంటుందని.. కాకపోతే అందులో క్రికెట్ ఇందులో హాకీ ని వాడారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: