రామ్ "ది వారియర్" లో ఆ ట్విస్ట్ అదిరిపోద్ది ?

VAMSI
తెలుగు హీరో రామ్ పోతినేని తాజాగా నటించిన యాక్షన్ మూవీ "ది వారియర్". ఈ సినిమాకు దర్శకుడిగా తమిల్ లో సక్సెస్ ఫుల్ అయినా లింగుస్వామి వ్యవహరించాడు. రెండు భాషలలో ఈ సినిమా విడుదల అవుతుండడంతో అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాను తెరకెక్కించాడట. సినిమా ఆసాంతం మాస్ మసాలా డైలాగులతో నింపేశాడట. అందుకే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రామ్ కూడా పోలీస్ పాత్రను చేస్తుండడంతో ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ అని పండగ చేసుకుంటున్నారు. అయితే మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కానుండడంతో ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

రామ్ పోతినేని పోలీస్ గా పవర్ ప్యాకెడ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడని ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. కాగా రామ్ ఇందులో పూర్తి సినిమా అంతా పోలీస్ పాత్ర చేయడం లేదట. ఇంతకు ముందు చాలా సినిమాలలో చూపించిన విధంగానే ఫస్ట్ హాఫ్ అంతా మామూలు పాత్రలో మరియు సెకండ్ హాఫ్ లో మాత్రమే పోలీస్ పాత్రలో అలరిస్తాడని తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... రామ్ మొదట్లో డాక్టర్ గా కనిపిస్తాడట. అయితే ఈ నేపథ్యంలో అతని కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఒక నిస్సహాయుడైన డాక్టర్ గా తాను సాధించలేని దానిని ... పోలీస్ గా మారి సాధిస్తాడని తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ కూడా అందరినీ ఎంతగానో అలరిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో రామ్ అద్భుతంగా నటించాడట. ఇక రామ్ కు ధీటుగా ఇందులో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. అయితే ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయడం లేదట. మరి రేపు విడుదల కానున్న ఈ సినిమాలో ఇంకెన్ని ట్విస్ట్ లు ఉన్నాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: