బ్రహ్మాస్త్ర ది విజన్..వీడియో అదిరిపోయిందిగా..
బ్రహ్మాస్త్ర ది విజన్' అంటూ వచ్చిన ఈ వీడియోలో అస్త్రాల ఉద్భవం, వాటిని మహర్షులు ఏ విధంగా కాపాడుతూ వచ్చారు.. ఈ అస్త్రాలలో వానరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర మరియు బ్రహ్మాస్త్రలు ఉన్నాయి. మిగతా అస్త్రాలలోకెళ్లా బ్రహ్మాస్త్ర చాలా శక్తివంతమైనదిగా మహర్షులు గుర్తిస్తారు. ఈ అస్త్రాలను ఎప్పటికీ కాపాడాలని ఈ మహర్షులు నిశ్చయించుకుంటారు. అయితే మారుతున్న కాలంతో ఈ అస్త్రాలను మహర్షులు తమ వంశాలకు చెందిన వారికి అప్పజెప్పగా, వారు వాటిని సంరక్షిస్తూ వస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ సినిమాలోని హీరో అతీత శక్తులు కలిగి ఉంటాడని అతడికే తెలియదు.
ఈ సినిమా కథలో శివ అనే కుర్రాడు తనకు శక్తులు ఉన్నాయని గుర్తించగా, అతడికి ఈ అస్త్రాలతో సంబంధం ఏమిటంటే.. అతడే ఓ అస్త్రం అని మనకు ఈ సినిమాలో చూపించబోతున్నారు. అతడు కూడా ఓ అస్త్రం అని.. అగ్ని అస్త్రంగా అతడు తన శక్తులతో దుష్టశక్తులను ఏ విధంగా ఎదుర్కొంటాడు అనేది మనకు బ్రహ్మాస్త్ర తొలిభాగంలో చూపించబోతున్నట్లు చిత్ర దర్శకుడు అయన్ ముఖర్జీ ఈ వీడియోలో తెలియజేశారు. మొత్తానికి బ్రహ్మాస్త్ర చిత్రం ఓ ట్రయాలజీ మూవీగా ప్రేక్షకులను విజువల్ వండర్‌తో మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని మొదలగు వాళ్ళు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు..