ఓటీటి లో నాని సినిమాకి స్పందన ఎలా ఉందంటే..!!
ప్రముఖ ఓటిటి ఛానల్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం విడుదల అయింది. అది కూడా ఈనెల 10వ తేదీన ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం వంటి భాషలలో విడుదలైంది. దీంతో ఏ చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటి లో చూస్తున్నారు. ఇలా చూసిన తర్వాత ఈ సినిమా పైన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు అభిమానులు నేటిజన్స్. నాని చాలా రోజుల తర్వాత మరొకసారి తన కామెడీ యాంగిల్ తో అలరించారని హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యిందని ఓటీటి ప్రేక్షకులు తెలుపుతున్నారు.
కాకపోతే నాని ,నజ్రియా మధ్య కాస్తంత రొమాంటిక్ సన్నివేశాలు ఉండి ఉంటే బాగుండేది అన్నట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా ప్రారంభమైన ఎంతోసేపటి వరకు హీరో హీరోయిన్ ట్రాక్ ప్రవేశించకపోవడంతో అంతగా ఆసక్తి చూపించలేదన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా గందరగోళంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. నటీనటులు అందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారని తెలియజేశారు కొన్ని సీన్స్ మరి సాగదీయడంతో కాస్త బోరింగ్ గా అనిపించిందని తెలుపుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ పరంగా బాగా ప్లాన్ చేసుకునే ఉంటే చిత్రం బాగుండేది అని తెలియజేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ వారంలో రెండో స్థానంలో నిలిచింది ఈ చిత్రం.