తెలుగు సినీ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈమె రీ ఎంట్రీ ఎప్పుడు?అంతేకాకుండా ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఇక ఇంతకు ముందు తెలుగు, తమిళం భాషల్లో టాప్ హీరోయిన్‌గా దుమ్ము రేపిన ఈ బ్యూటీ గత 2020లో పెళ్లి చేసుకుని ఆమె అభిమానులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి.అయితే చాలా మంది హీరోయిన్లు వివాహానంతరం నటనను కొనసాగిస్తున్నారు.ఇక అలాంటి కాజల్ నటనకు విరామం ఇచ్చి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అన్న సంగతి తెలిసిందే.
అయితే గత ఏప్రిల్ నెలలో పండంటి బిడ్డను కని అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు ఈమె .కాగా కొన్ని నెలల పాటు నటనకు దూరమే అని, అంతేకాకుండా ఆ తరువాత మంచి కథా చిత్రాలతో రీఎంట్రీ అవుతానని ఓ భేటీలో పేర్కొన్నారు ఈమె. ఇదిలావుండగా ఆచార్యలో చిరంజీవి పక్కన మెరిసినా ఆమె నటించిన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించారు.ఇక కాజల్ నటించిన మరో భారీ చిత్రం ఇండియన్-2. అయితే శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలారిష్టాలు అన్నట్లు ఆది నుంచి ఆటంకాలతో కొంత భాగం చిత్రీకరణ జరుపుకుని ఆగిపోయింది అన్నట్టుగా సమాచారం.
పోతే ఇందులో ఉన్న కాజల్ అగర్వాల్‌ను తొలగించినట్లు ప్రచారం జరిగింది. అయితే పలువురి ప్రయత్నాలు, రాయబారాల ఫలితంగా తాజాగా ఈ చిత్ర స్క్రిప్టు బూజు దులపడానికి యూనిట్ వర్గాలు సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం తెలుస్తోంది. అంతేకాదు దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్‌చరణ్ కథానాయకుడిగా ద్విభాషా చిత్రం చేస్తున్నారు.ఇప్పటికే 70 శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.కాగా దీని తరువాత ఇండియన్-2 చిత్రాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం.అయితే మరి ఇందులో కాజల్ నటిస్తారా? లేదా? ఇక అసలు ఆమె రీ ఎంట్రీ ఎప్పుడు? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.