అందాల ముద్దు గుమ్మ దివి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి మూవీ లో ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించి తెలుగు బిగ్ బాస్ షో ఈ అవకాశాన్ని దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను మనసు దోచుకోవడం మాత్రమే కాకుండా ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది.
అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా దివి అనేక అవకాశాలను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే దివి తాజాగా సుశాంత్ హీరోగా ప్రియా ఆనంద్ హీరోయిన్ గా తెరకెక్కిన మా నీళ్ళ ట్యాంక్ అనే వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ కు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా, ప్రేమ్ సాగర్ , అన్నపూర్ణమ్మ , నిరోషా , రామరాజు , బిందు అప్పాజీ అంబరిశ్ , చంద్రమౌళి , లావణ్య రెడ్డి , సందీప్ వారణాసి , ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ జూలై 15 వ తేదీ నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన జీ 5 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఇలా ఈ వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా తాజాగా దేవి మాట్లాడుతూ ... ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కల్పించిన జీ 5 సంస్థకు మరియు దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలను దివి చెప్పుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా దివి ఏ రేంజ్ క్రేజ్ ని సంపాదించుకుంటుందో చూడాలి. ఈ వెబ్ సిరీస్ లో దివి రమ్య అనే పాత్రలో నటించింది.