"ది వారియర్'' మూవీ ఫ్లాప్ కావడానికి కారణం అదేనా...!

Anilkumar
తాజాగా రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ సినిమా రామ్ అభిమానులకు నచ్చినా మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక 40 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది.ఇదిలావుండగా నైజాం, వైజాగ్ ఏరియాల ది వారియర్ హక్కులను భారీ మొత్తానికి రామ్ కొనుగోలు చేయడంతో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని అందరూ భావించారు.అయితే ఇక  అందుకు భిన్నంగా ఈ సినిమా ఫలితాన్ని అందుకోవడం గమనార్హం.ఇదిలావుంటే  మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ది వారియర్ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడుతోంది.

 అయితే ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుందో లేదో చెప్పవచ్చు. ఇక వారియర్ మూవీ కథ, కథనం కొత్తగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని కామెంట్లు వినిపిస్తోంది.ఇకపోతే రొటీన్ స్టోరీ లైన్ తో రామ్ ప్రేక్షకుల ముందుకు రావడంతో ది వారియర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.కాగా  రామ్ తర్వాత సినిమాల స్క్రిప్ట్ ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇక రామ్ తర్వాత సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.అయితే  స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఈ సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం.

అయితే బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించే సినిమాలతో విజయాలను అందుకుంటే హీరో రామ్ కు స్టార్ స్టేటస్ రావడం ఖాయమని చెప్పవచ్చు.పోతే  ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న రామ్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.ఇక  సినిమాసినిమాకు రామ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.అయితే  కొత్తదనం ఉన్న కథలను రామ్ ఎంచుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: