టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన
విక్రమ్ కె
కుమార్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 13 బి సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న
విక్రమ్ కె
కుమార్ ఆ తర్వాత నితిన్ హీరోగా
నిత్య మీనన్
హీరోయిన్ గా తెరకెక్కిన ఇష్క్
మూవీ తో
టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.
ఆ తర్వాత మనం సినిమాతో మరో అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న
విక్రమ్ కె
కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు 24 ,
హలో ,
గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
విక్రమ్ కె
కుమార్ థాంక్యూ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో
నాగ చైతన్య హీరోగా నటించగా
రాశి కన్నా
హీరోయిన్ గా నటించింది. ఈ
సినిమా జూలై 22 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో
విక్రమ్ కె
కుమార్ ఈ
సినిమా ప్రమోషన్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ
మూవీ ని ప్రమోట్ చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న
విక్రమ్ కె
కుమార్ తదుపరి ప్రాజెక్ట్ ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
విక్రమ్ కె
కుమార్ ప్రస్తుతం
నాగ చైతన్య తో ఒక హారర్ వెబ్ సిరీస్ ను చేస్తున్నాను , ఆ వెబ్ సిరీస్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే యాక్షన్
జోనర్ లో కొనసాగే ఒక
హిందీ సినిమా చేయబోతున్నాను.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక
సినిమా చేయబోతున్నాను అని
విక్రమ్ కె
కుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ల గురించి తెలియజేశాడు.