యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈస్మార్ట్ శంకర్ , రెడ్ వంటి రెండు వరుస విజయాల తర్వాత రామ్ పోతినేని తాజాగా ది వారియర్ అనే మాస్ ఎంటర్ టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో కెరియర్ లో మొట్ట మొదటి సారి రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం, తమిళ క్రేజీ దర్శకుడు లింగుసామి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా మంచి అంచనాల నడుమ ఈ మూవీ నిన్న అనగా జూలై 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
నైజాం : 1.95 కోట్లు , సీడెడ్ : 1.06 కోట్లు , యూ ఎ : 1.02 కోట్లు ,
ఈస్ట్ : 51 లక్షలు , వెస్ట్ : 67 లక్షలు ,
గుంటూర్ : 1.19 కోట్లు , కృష్ణ : 33 లక్షలు , నెల్లూర్ : 29 లక్షలు
మొదటి రోజు ది వారియర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.02 కోట్ల షేర్ , 10.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 40 లక్షలు .
ఓవర్ సీస్ లో : 30 లక్షలు .
తమిళ్ : 30 దాదాపుగా 30లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ మూవీ మొదటి రోజు 8.02 కోట్ల షేర్ , 12.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.