బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన తన నటన తో.. సేవా గుణంతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన సల్మాన్ ఖాన్ తన సినిమాల ద్వారా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.అయితే సినిమాలపరంగా ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నాడే తప్ప అభిమానులను తనవ్ పెళ్లి విషయంలో నిరుత్సాహపడేలా చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతూ ఉండడం గమనార్హం. అయితే కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా బిగ్బాస్ వంటి రియాల్టీ షోల ద్వారా కూడా హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ సల్మాన్ ఖాన్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాడు.
15 సంవత్సరాలగా హిందీలో బిగ్ బాస్ దిగ్విజయంగా కొనసాగుతూ ఉందంటే అందుకు కారణం హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ముఖ్య కారణం అని చెప్పవచ్చు. అయితే అంతే కాదు తెలుగు, తమిళ్ వంటి భాషల్లో కూడా బిగ్ బాస్ ప్రారంభం అవ్వడానికి కారణం హిందీ ఎపిసోడ్ల స్ఫూర్తి అని చెప్పవచ్చు.ఇక తెలుగుతో పోల్చుకుంటే హిందీలో ప్రతి సంవత్సరం కూడా బిగ్ బాస్ కి సంబంధించి క్రేజ్ పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా తగ్గినట్లు తెలియడం లేదు. ప్రతి ఏడాది కూడా రెట్టింపు ఉత్సాహంతో క్రేజ్ ని పెంచుకుంటూ దూసుకుపోతున్నారు హిందీ బిగ్ బాస్ నిర్వాహకులు.పోతే బిగ్ బాస్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం కూడా జరుగుతుంది.
ఇదిలావుంటే తాజాగా హిందీ వర్షన్ లో 16వ బిగ్ బాస్ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో హోస్ట్ గా బాధ్యతలు సల్మాన్ ఖాన్ కి అప్పగించినట్లు సమాచారం. అయితే అంతేకాదు ఇప్పటివరకు హోస్ట్ గా ఎక్కువ సీజన్లు చేసింది కూడా సల్మాన్ ఖాన్ కావడం విశేషం. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తే ఆ షో పెద్ద సక్సెస్ అవుతుందని అక్కడ సెంటిమెంట్ గా కూడా మారిపోయింది. పోతే గత సీజన్లకి రూ.350 కోట్ల వరకు భారీ పారితోషికం అందుకున్న ఈయన.. ఇక ఈసారి సీజన్ కి మాత్రం ఏకంగా రూ.1000 కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. కాగా నిర్వాహకులు సల్మాన్ ఖాన్ ఆఫర్ ఒప్పుకుంటారో లేదో తెలియాలి...!!