ఏంటి సింగర్ మనోకి బాల్య వివాహం జరిగిందా.. వామ్మో?
కానీ ఎవరు ఎక్కువ ఎపిసోడ్లు చేయలేకపోయారు అనే చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక జబర్దస్త్ జడ్జి గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ మనో ఎన్నో ఎపిసోడ్ల నుంచి కంటిన్యూగా కొనసాగుతూ వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఆయనకు ఎంతగానో అలవాటుపడిపోయారు. అయితే ఎప్పటిలాగానే కమెడియన్స్ ప్రతివారం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక జబర్దస్త్ ప్రోమో లో భాగంగా అనసూయ జడ్జ్ మనో పెళ్లి గురించి చెప్పాలి అంటూ అడుగుతుంది.
ఈ సందర్భంగా మనో తన పెళ్లి గురించి చెప్పిన విషయాలు తెలిసి ప్రతి ఒక్కరు షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. నా పెళ్లి నేను 19 ఏళ్ళు ఉన్నప్పుడు చేసేసారు. బాగా సంపాదిస్తున్నానని చివరికి పెళ్లి చేసి భార్యను కట్టబెట్టారు అంటూ మనో చెప్పుకొచ్చాడు. నేను 19 ఏళ్ళు ఉన్న సమయంలో ఇక నా కాబోయే భార్య పదహారేళ్ళ వయసు లోనే ఉంది అంటూ చెప్పాడు. దీంతో ఏంటి మీరు బాల్య వివాహం చేసుకున్నారా అంటూ అనసూయ షాక్ అవుతుంది. ఇక సింగర్ మనో చెప్పిన మాటలతో అభిమానులు సైతం షాక్ లో మునిగిపోయారూ.