తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందింది నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్నది. అయితే ఇక వీరిద్దరూ ఐదేళ్లపాటు డేటింగ్ లో ఉంటూ వివాహం చేసుకున్నారు.ఇదిలావుంటే జూన్ 9వ తేదీన అనుకున్నట్టుగానే అంగరంగ వైభవంగా ఇద్దరు కుటుంబాల మధ్య వివాహం చేసుకున్నారు.ఇకపోతే చెన్నై సమీపంలో మహాబలేశ్వరంలో వీరిద్దరూ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇదిలావుంటే ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ , డైరెక్టర్ మణిరత్నం తదితర నటీనటులు రావడం జరిగింది.
అయితే ఇక ఇందులో కొంతమంది ఫోటోలు మాత్రమే బయటికి రావడం జరిగింది. అయితే చాలావరకు సెలబ్రిటీలకు సంబంధించి ఫోటోలు కానీ వీడియోలు కానీ అసలు బయటికి రాలేదు..ఈ వివాహ వేడుకకు సంబంధించిన పూర్తి వీడియోను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ కి భారీ మొత్తానికి అమ్మేసినట్లు తెలుస్తోంది.అయితే ఈ పెళ్లి వీడియోని డైరెక్టర్ గౌతమ్ మేనన్ రూపొందించారు. ఇక ఇదంతా ఇలా ఉండగా తాజాగా నెట్ ఫిక్స్ లో నయనతార పెళ్లి వీడియో విడుదల కానుంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి .అయితే కానీ సడన్ గా నెట్ ఫ్లిక్స్ వీరికి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇక నయనతార - విగ్నేష్ తో నెట్ ఫ్లిక్స్ ఒప్పందాన్ని రద్దు చేసినట్లుగా సమాచారం.అయితే అంతేకాకుండా ఇలా నెట్ ఫ్లిక్స్ ఎందుకు చేసిందో అనే విషయంపై ఆరా తీయగా.. అందుకు సమాధానంగా నయనతార , విగ్నేష్ ల వివాహం జరిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఇది నెట్ ఫ్లిక్స్ నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక ఇది ఎంతవరకు నిజమో అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.అయితే మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎవరు తెలియజేస్తారో చూడాలి...!!