దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న
గౌతమ్ వాసుదేవ్
మీనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న
గౌతమ్ వాసుదేవ్
మీనన్ ప్రస్తుతం సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాడు.
అందులో భాగంగా ఇప్పటికే
గౌతమ్ వాసుదేవ్
మీనన్ అనేక సినిమాల్లో, అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
గౌతమ్ వాసుదేవ్
మీనన్ సీతా రామం అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ లో
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా మృణాళిని ఠాకూర్
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ లో రష్మీక మందన ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ
మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో
సుమంత్ కూడా కనిపించబోతున్నాడు. ఈ
మూవీ కి ప్రేమకథల స్పెషలిస్ట్ ఆయన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సీతా రామం
సినిమా యుద్ధంతో రాసిన
ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సీతా రామం చిత్ర బృందం ఈ
మూవీ లోని
గౌతమ్ వాసుదేవ్
మీనన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేసింది.
అలాగే ఈ
మూవీ లో
గౌతమ్ వాసుదేవ్
మీనన్ ... మేజర్ సెల్వన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు కూడా చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. మరి ఈ
మూవీ లోని పాత్రతో
గౌతమ్ వాసుదేవ్
మీనన్ ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటాడో చూడాలి. సీతా రామం
మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.