కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ యువ హీరో అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నేటితో కిరణ్ అబ్బవరం 30 వ వసంతం లోకి అడుగు పెడుతున్నాడు.
 

శుక్రవారం (జూలై 15న) పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో  కిరణ్ అబ్బవరం కు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ రోజు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు కావడంతో ఈయన నటించిన కొన్ని మూవీ లకు సంబంధించిన అప్డేట్ లను కూడా మేకర్స్ విడుదల చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం అరడజనుకు పైగా మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో  ర‌మేష్ కాడూరి  దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది.

ఈ సినిమా టైటిల్ ను మీటర్ గా ప్రకటించిన చిత్ర బృందం కిరణ్ అబ్బవరం సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో ఉన్నాడు. మేటర్ మూవీ లో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు ఒక టాక్ నడుస్తుంది. అతుల్య ర‌వి ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో క్లాప్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌పై చిరంజీవి, హేమ‌ల‌త ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: