వేణు తొట్టెంపూడి భార్య గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా?
వేణు తొట్టెంపూడి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని ఆయన అభిమానులు అందరూ కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అభిమానుల కోరిక తీర్చేందుకు వేణు తొట్టెంపూడి సిద్ధమైపోయారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు వేణు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అనే చెప్పాలి. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ రెవెన్యూ ఆఫీసర్ గా నటిస్తే వేణు తొట్టెంపూడి సీఐ మురళి గా ప్రేక్షకులను పలకరించ పోతున్నాడు.
ఇక వేణు తొట్టెంపూడి వ్యక్తిగత విషయాలకు వస్తే వేణు భార్య పేరు అనుపమా చౌదరి. ఇక వీరికి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. వేణు భార్య అనుపమ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసింది. అంతేకాదండోయ్ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక వివాహం జరిగి 10 సంవత్సరాలు పైనే అవుతున్న ఒకవైపు కామెడీ బాధ్యతలు మరోవైపు తన బిజినెస్ లు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు స్క్రాప్ బుక్ బిజినెస్ ప్రారంభించిన అనుపమ అందులో మంచి ప్రావీణ్యం సంపాదించిందట. ఇక దేశ విదేశాల్లో అనుపమ లావాదేవీలు జరుపుతూ ఉంటుందట.