సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సమంత కారణం..!!
ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి సుమారుగా ఇప్పటికి రెండు వారాలు పైన అవుతోంది. సమంత చివరిగా జూన్ 30వ తేదీన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత సైలెంట్ గా ఉంటోంది. ఇక ట్విట్టర్ లో కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దీంతో సమంత అభిమానుల సైతం చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా ఆ మధ్య సమంత ఇంస్టాగ్రామ్ హ్యాక్ చేశారనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత సమంత ఒక పోస్ట్ గాని స్టోరీ కానీ పోస్ట్ చేయలేదు.
ఈ కారణంగానే సమంత సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉండిపోయిందా.. లేదంటే సోషల్ మీడియాకు కావాలనే దూరంగా ఉంటోందా అనే విషయం అభిమానులలో చర్చనీయాంశంగా మారుతోంది. కొంతమంది ఆమె సోషల్ మీడియాలో డిటెక్స్ లో ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి కొంతమంది మాత్రం సమంత కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది అన్నట్లు కామెంట్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం త్వరలోనే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ తో సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇస్తుంది అని నమ్మకాన్ని తెలియజేస్తున్నారు.