'థ్యాంక్యూ' సినిమా రన్ టైమ్ మరీ అంత తక్కువా?

Satvika
అక్కినేని నాగ చైతన్య బంగార్రాజు సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు వరుస సినిమా లలో నటిస్తూ బిజిగా ఉన్నాడు.. ఇప్పుడు నటిస్తున్న తాజా చిత్రం 'థ్యాంక్యూ' ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ ఔట్ అండ్ ఔట్ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిస్తుండటం తో ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల తో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యియి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఈ సినిమా పై ఉన్న అంచనాలు రెట్టింపు చేశాయి.


ఈ సినిమా ను జూలై 22న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమా లో నాగ చైతన్య పాత్రను చాలా వైవిధ్యంగా డిజైన్ చేసినట్లు గా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా రన్‌ టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లు గా తెలుస్తోంది. థ్యాంక్యూ చిత్ర రన్‌ టైమ్ 2 గంటల 9 నిమిషాలకు లాక్ చేసినట్లు గా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు ఈ రన్‌టైమ్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది..


ఈ సినిమాలో చైతూ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అభిమానిగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా లో చైతూ సరసన అందాల భామలు రాశి ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌లు నటిస్తుండగా, ఈ సినిమా ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రెస్టీజియస్‌ గా నిర్మిస్తున్నాడు. మరి 'థ్యాంక్యూ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుం దో తెలియాలంటే జూలై 22 వరకు వెయిట్ చేయాల్సిందే...ఈ సినిమా కూడా హిట్ అయితే మాత్రం చైతు లైఫ్ టర్న్ అయినట్లే...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: