చెమటలు పట్టేలా వర్కౌట్ చేస్తున్న రామ్ చరణ్ వీడియో వైరల్..!!
RRR సినిమాలో రామ్ చరణ్ ఫిట్నెస్ కారణంగానే ఆ సినిమాలో అంత గొప్పగా తన పాత్ర పండిందని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ రోజున రామ్ చరణ్ జిమ్ములో పలు కసరత్తులు చేస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. రామ్ చరణ్ ఎంతలా కష్టపడ్డాడో అన్నది ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. ఉదయం లేవగానే రామ్ చరణ్ జిమ్ములో సాధారణమైన శ్రమ చేయడానికి సిద్ధమయ్యాడు బలమైన వర్కౌట్లు చేస్తూ ఉన్నారు.
ఇక ఈ వీడియో విషయానికి వస్తే హెవీ వెయిట్ ని తన కాళ్ళతో తొక్కడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. చెమటలు చింతిస్తున్న రామ్ చరణ్ ఈ హార్డ్ వర్క్ చేసి అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక డైరెక్టర్ శంకర్ సినిమా కోసం ఇంతలా కష్టపడుతున్నారు. కేవలం తన ఫిట్నెస్ కోసం ఇంతలా వర్కౌట్ చేసే పని ఉండదు కదా అన్నట్లుగా పలువురు నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం శంకర్ డైరెక్షన్ లో సినిమా కోసమే తన లుక్ ని హైలెట్ చేసే అందుకే ఇంతలా శ్రమ పడుతున్నాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తుంది. RC -15 సినిమా అంతకుమించి ఫైట్ సీన్లు భారీగానే ప్లాన్ చేసినట్లుగా సమాచారం ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.